Saturday, July 28, 2018

మీ బ్లాగుల్లోనూ, వెబ్ సైట్స్ లోనూ,ఫేస్ బుక్,ట్విట్టర్లోనూ డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయండిలా?

ఎక్కువ మంది నిర్వాహకులు లేఖిని లేక ఇతర తెలుగు సాప్ట్ వేర్ల ద్వారా తమ,తమ పోస్టులను టైప్ చేసుకుని వాటిని కాపీ చేసి తమ సైట్లలో పేస్ట్ చేస్తుంటారు. అయితే లేఖిని వాటిని వాడాలంటే సులువుగా ఉన్నప్పటికీ ఈ కాపి,పేస్టులు చాలా చిరాకును కలిగిస్తాయి.దానితోపాటు టైం కూడా వృధా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గానే మన సైట్లలో టైప్ చేసుకుంటే ఎలా ఉంటుంది.ఒకసారి ఆలోచించండి. మీకు ఆ విధంగా సెట్ చేసుకోవాలంటే వెంటనే ఈ క్రింది సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి.
  ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఈ క్రింది చిత్రం ఒకసారి చూడండి.

యారో మార్క్ ఉన్నచోట మీ తెలుగు సింబల్ వచ్చేలా సెలక్ట్ చేసుకోండి.తరువాత మీ కంప్యూటర్లో తెలుగులో ఏ ఫైల్ టైప్ చేయాలన్నా ముందుగా Ctrl + Shift + T కొట్టండి. అంతే మీ కంప్యూటర్లో గాని లేక మీ సైట్లలో గాని యధేచ్చగా తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్లీ తెలుగులో నుండి వెనుకకు రావాలనుకుంటే మళ్లి అదే విధంగా Ctrl + Shift + T కొట్టండి.తెలుగు నుండి బయటికి వచ్చేస్తారు. మీకు సందేహాలున్న,సలహాలున్న కామెంట్ బాక్స్ లో పెట్టంది.శుభం.

Wednesday, July 19, 2017

సిగ్గు లేని నాయకులు- సిగ్గు లేని ఓటర్లు

మన దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది, ఆర్ధిక వ్యవస్థ బలపడుతోంది, ఇండియా పూర్తిగా వెలిగిపోతోందంటూ మన పాలకులు చేసే ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మారుమ్రోగుతోంది. అంతర్జాతీయ క్రీడలు సైతం భారతదేశంలో నిర్వహిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇండియా పోటీపడుతోంది. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, ఇక నాణానికి మరోవైపు గమనిస్తే సగటు మనిషి జీవనం దుర్భరంగా మారింది. పేదలకు కూడు, గూడు, గుడ్డ కరువయ్యాయి. ప్రజల కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. రైతుల సమస్యలు తగ్గడానికి బదులు నానాటికీ పెరిగిపోతున్నాయి... Read More

Saturday, January 9, 2016

Blog vedika అగ్రిగేటర్ ను చూడండి.

.కూడలి మూతబడిన తరువాత బ్లాగ్ వేదిక అగ్రిగేటర్ ను చాలా చక్కగా డిజైన్ చేశాను. ప్రియమైన బ్లాగర్లందరూ తమతమ బ్లాగులను బ్లాగు వేదికకు జతపర్చండి. మరిన్ని వివరాలకు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Thursday, November 12, 2015

ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నవారు తప్పనిసరిగా వాడాల్సిన Anty Virus ఏది?

నెట్ కనెక్షన్ కలిగినవారు చాలా మంది ఫ్రీ anty virus softwares వాడుతూ ఉంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఫ్రీ softwares నుండి మన సిస్టమ్ కాపాడుకోవడం కష్టమే కనుక తప్పనిసరిగా Anty Virus కొనుగోలు చేయాల్సిందే.వాటిల్లో ప్రధానంగా K7 లేక kaspersky Softwares బాగుంటాయి.

Tuesday, November 3, 2015

ఈ మధ్య బ్లాగులు ఎక్కువుగా హాకర్స్ బారిన పడడమో లేక వైరస్ తో నిండిపోయి గూగుల్ క్రోమ్ లాంటి సైట్లలో బ్లాక్ అవడమో జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏమిటి?

నాకు తెలిసిన ప్రధాన కారణాలు రెండున్నాయి.
అవి 1. Template లోని ఎర్రర్ సమస్యలు.
       2. సోషల్ సైట్ల like boxలాంటి widgets

మీకు తెలిసిన పరిష్కారాలు,కారణాలు సూచించగలరు.